Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజయ్య కోడలు సారిక ఈ-మెయిల్ ను గుర్తించిన వరంగల్ పోలీసులు

కాంగ్రెస్ నేత సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవల కేసు దర్యాప్తులో భాగంగా చనిపోక ముందు ఆమె న్యాయవాది రెహానాకు చేసిన ఈ-మెయిల్ ను వరంగల్ పోలీసులు గుర్తించారు. అందులో ఏయే అంశాలను ఆమె వెల్లడించిందో తెలుసుకున్నారు. తన వివాహం జరిగాక పరిణామాలు, కష్టాలను సారిక మెయిల్ లో వివరించిందని, అత్తింటివారు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పెట్టారని మెయిల్ లో పేర్కొన్నట్టు తెలిసింది. పిల్లలకు అన్నం పెట్టేందుకు కూడా డబ్బులు ఇవ్వలేదని, మానసికంగా తాను తీవ్ర క్షోభ అనుభవించానని సారిక మెయిల్ లో తన వ్యథనంతా వ్యక్తం చేసింది. ఇల్లు విడిచి వెళ్లి పోవాలని ప్రతిసారీ తనను అత్త వేధింపులకు గురిచేసినట్టు మెయిల్ లో తెలిపింది. ప్రతిరోజూ తనను తిట్టడం, కొట్టడం చేశారని, తన తల్లి పంపిన చీరను కూడా తీసుకోనివ్వలేదని వివరించింది. తమ కోసం జీవితం త్యాగం చేయమంటూ మామ రాజయ్య వేధించారని పేర్కొంది. అయితే ఆ మెయిల్ సారిక పంపిందా? లేక మరెవరైనా పంపారా? అన్న దిశగా పోలీసులు దర్యాప్తు చేసి తెలుసుకోనున్నారు.

More Telugu News